Thursday, 17 September 2026
  • Home  
  • బ్రాహ్మణ వీధిలో వినాయక లడ్డూ వేలం..బొమ్ము శివకు దక్కిన లడ్డు
- కడప

బ్రాహ్మణ వీధిలో వినాయక లడ్డూ వేలం..బొమ్ము శివకు దక్కిన లడ్డు

మండల కేంద్రమైన సిద్ధవటంలోని బ్రాహ్మణవీధిలో వినాయక చవితి వేడుకలను రెండో వార్షికోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకల్లో భాగంగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన 5 కిలోల లడ్డూను వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో బ్రాహ్మణవీధికి చెందిన బొమ్ము శివ రూ.31,500లకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట సందర్భంగా స్థానికులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలు రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సందడి నెలకొంది.

మండల కేంద్రమైన సిద్ధవటంలోని బ్రాహ్మణవీధిలో వినాయక చవితి వేడుకలను రెండో వార్షికోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వేడుకల్లో భాగంగా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన 5 కిలోల లడ్డూను వేలం నిర్వహించారు. ఈ వేలంపాటలో బ్రాహ్మణవీధికి చెందిన బొమ్ము శివ రూ.31,500లకు లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట సందర్భంగా స్థానికులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకలు రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో సందడి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.