బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో నేడు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. అనంతరం రేపు రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా, సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో నేటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఖాతాదారులు నగదు లావాదేవీలు, చెక్కులు, ఇతర బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర లావాదేవీలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.


