10/09/2026 పున్నమి ప్రతినిధి బోధన్
పొలాల అమావాస్య – రైతు సంస్కృతికి ప్రతీక
పల్లె సంస్కృతిలో వ్యవసాయానికి, రైతు జీవనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భూమిని తల్లిగా, పంటను దైవ ప్రసాదంగా భావించే రైతు సంప్రదాయానికి ప్రతీకగా పొలాల అమావాస్యను బోధన్ మరియు పరిసర గ్రామాల్లో రైతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా రైతులు పొలాలకు వెళ్లి భూమాతను పూజించి. వ్యవసాయంలో తమకు అండగా నిలిచే ఎద్దులు, ఆవులు తదితర పశువులను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలు పెట్టి, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేసారు. అలాగే నాగలి, గొర్రు, కొడవలి వంటి వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి పూజించడం ఇక్కడి తరతరాల ఆనవాయితీ.
సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఈ రోజున కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పండుగను జరుపుకోవడం ఇక్కడి ఆనవాయితీ ఐక్యత, ఈ పండుగ ద్వారా సంప్రదాయాలు మరింత బలపడతాయి.
భూమి, రైతు, పశుసంపద, పంటల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే పొలాల అమావాస్య రైతు కష్టానికి గౌరవం తెలిపే పండుగగా రైతులు తెలియజేయడం జరిగింది.. ఇక్కడికొన్ని గ్రామంలో శ్రీలు సౌభాగ్యం సంతానం పిల్లల యోగక్షేమల కోసం ఆచరించే వ్రతం లా కూడా ఈ పొలాల అమావాస్య ను కొలుస్తారు.. తరతరాలుగా వస్తున్న ఈ పల్లె సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు..




