వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు. అనంతరం నిర్వాహకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని గణపయ్యను ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మేడా మధుసూదన్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె కోరారు. భాకరాపేట గ్రామంలో గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు.
వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, భజనలు తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.


