Wednesday, 23 September 2026
  • Home  
  • బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా కమిటీ
- BHADRADRI

బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా కమిటీ

బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా కమిటీ బద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్సీ మోర్చాను బలోపేతం చేసే దిశగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ పర్యటన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాపలమడుగు రాకేష్ బాబు ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా వంగూరి రామ్మూర్తి, గొడ్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శులుగా సంకినేని చంటి రాజు, జెర్రిపోతుల సాథ్విక్, కార్యదర్శులుగా మహంకాళి శంకర్, కోగిల శ్రీను, నల్లగట్ల తిరుపతి, ఐటీ కన్వీనర్‌గా కామ శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్‌గా జెర్రిపోతుల ప్రణీత్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాకేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నూతన కమిటీకి మార్గనిర్దేశం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో ఎస్సీ మోర్చాను విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తామని పేర్కొన్నారు.

బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా కమిటీ

బద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి )

భద్రాద్రి కొత్తగూడెం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్సీ మోర్చాను బలోపేతం చేసే దిశగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ పర్యటన సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చాపలమడుగు రాకేష్ బాబు ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా వంగూరి రామ్మూర్తి, గొడ్ల రాజయ్య, ప్రధాన కార్యదర్శులుగా సంకినేని చంటి రాజు, జెర్రిపోతుల సాథ్విక్, కార్యదర్శులుగా మహంకాళి శంకర్, కోగిల శ్రీను, నల్లగట్ల తిరుపతి, ఐటీ కన్వీనర్‌గా కామ శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్‌గా జెర్రిపోతుల ప్రణీత్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రాకేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నూతన కమిటీకి మార్గనిర్దేశం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మండలం, గ్రామ స్థాయిలో ఎస్సీ మోర్చాను విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.