దళితులు సామజికంగా రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యమై బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతో పాటు సమాజ మార్పు కొరకు దళితులు ఐక్యంగా ఉద్యమించాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాయవాది బోట్ల పవన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోని దళిత యువకులు ఉన్నతమైన చదువులు చదివి ఆయా తమ దళిత పల్లెల్లో దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. దళితులు సమాజంలో సాగుతున్న పరిణామాలను గమనించి చైతన్యం అవుతున్నవేళ దీన్ని గ్రహించిన మనువాదులు దళితులను ఐక్యం కాకుండా చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ దళితుల ఐక్యతను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని వారు అన్నారు. ఈ మనువాదులు చేస్తున్న కుట్రలను దళిత సమాజం గుర్తించి అప్రమత్తమై ఈ కుట్రలను తిప్పి కొట్టాలని వారు అన్నారు
అనంతరం దళిత మేధా శక్తి అర్షనపల్లి గ్రామ కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
గ్రామ అధ్యక్షులుగా ములుగు సుభాష్ ప్రధాన కార్యదర్శిగా దామెర ప్రమోద్ అధికార ప్రతినిధి – రొట్టె రమేష్ కమిటి సభ్యులుగా దామెర సదానందం ములుగు శోభన్ నియమితులయ్యారు
ఈ సమావేశంలో దళిత మేధా శక్తి వ్యవస్థాపక సభ్యులు శ్రీ పెంబర్తి శ్రీనివాస్ దళిత మేధా శక్తి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి మధుకర్ తదితరులు పాల్గొన్నారు

దళితులు చైతన్యమై హక్కులతో పాటు సమాజ మార్పు కోసం ఉద్యమించాలి-దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బోట్ల పవన్
దళితులు సామజికంగా రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యమై బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతో పాటు సమాజ మార్పు కొరకు దళితులు ఐక్యంగా ఉద్యమించాలని దళిత మేధా శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు న్యాయవాది బోట్ల పవన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకోని దళిత యువకులు ఉన్నతమైన చదువులు చదివి ఆయా తమ దళిత పల్లెల్లో దళితుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. దళితులు సమాజంలో సాగుతున్న పరిణామాలను గమనించి చైతన్యం అవుతున్నవేళ దీన్ని గ్రహించిన మనువాదులు దళితులను ఐక్యం కాకుండా చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ దళితుల ఐక్యతను విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని వారు అన్నారు. ఈ మనువాదులు చేస్తున్న కుట్రలను దళిత సమాజం గుర్తించి అప్రమత్తమై ఈ కుట్రలను తిప్పి కొట్టాలని వారు అన్నారు అనంతరం దళిత మేధా శక్తి అర్షనపల్లి గ్రామ కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ అధ్యక్షులుగా ములుగు సుభాష్ ప్రధాన కార్యదర్శిగా దామెర ప్రమోద్ అధికార ప్రతినిధి – రొట్టె రమేష్ కమిటి సభ్యులుగా దామెర సదానందం ములుగు శోభన్ నియమితులయ్యారు ఈ సమావేశంలో దళిత మేధా శక్తి వ్యవస్థాపక సభ్యులు శ్రీ పెంబర్తి శ్రీనివాస్ దళిత మేధా శక్తి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి మధుకర్ తదితరులు పాల్గొన్నారు

