బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం.. భారీ వర్షాల నేపథ్యంలో కీలక నిర్ణయం
విశాఖపట్నం జిల్లా: (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 22::గాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం (23వ తేదీ) విశాఖపట్నం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
— పున్నమి న్యూస్


