బుధరావుపేట గ్రామంలో బంద్ పిలుపు మేరకు పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మరియు అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బంద్‌కు గ్రామ ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థల యాజమాన్యాలు సంపూర్ణ సహకారం అందించారు.బంద్‌ను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో విస్తృతంగా పర్యటించి వ్యాపారులు, దుకాణదారులు మరియు ప్రజలను కలిసి సహకరించాలని కోరారు. వారి పిలుపుకు స్పందించిన ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రజల ఐక్యతతోనే న్యాయం సాధించగలమని పేర్కొన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన బుధరావుపేట గ్రామ ప్రజలకు, వ్యాపారులకు, విద్యాసంస్థలకు మరియు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.



