బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సునీల్ బాన్సల్కు పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి నున్నా రవికుమార్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. పున్నమి ప్రతినిధితో మాట్లాడుతూ.. సునీల్ బాన్సల్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దేశసేవలో పార్టీ మరిన్ని విజయాలు సాధించేలా ఆయన నాయకత్వం దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలకు ఆయన నియామకం నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని రవికుమార్ అన్నారు



