ఖమ్మం పార్లమెంట్ బీజేపీ ఎస్సీ మోర్చా కన్వీనర్‌గా కోటమర్తి సుదర్శన్ నియమితులయ్యారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ సూచన మేరకు ఈ నియామకం చేపట్టారు. ఎస్సీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు బండ్ల రిగన్ ప్రతాప్ సుదర్శన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎస్సీ మోర్చాను పార్లమెంట్ పరిధిలో మరింత విస్తరించాలని నాయకులు సూచించారు. సుదర్శన్‌కు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.



