రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 (పున్నమి ప్రతినిధి)
ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న నవీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ముస్తాబాద్ మండలం గోపాల్పల్లి గ్రామపంచాయతీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సవీన్ ఎల్లారెడ్డిపేటలోని తన నివాసంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాఘి పండుగ సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


