Monday, 7 September 2026
  • Home  
  • ఫెడరేషన్ పాదయాత్ర ఒక సువర్ణ అధ్యాయం
- ఖమ్మం

ఫెడరేషన్ పాదయాత్ర ఒక సువర్ణ అధ్యాయం

*ఫెడరేషన్ పాదయాత్ర ఒక సువర్ణ అధ్యాయం* *ప్రజా ఉద్యమాలే మార్పుకు పునాది* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగిన ఉద్యమాలు చరిత్రలో సువర్ణ అధ్యాయాలుగా నిలిచాయి. ఒక చిన్నారి ప్రాణాల కోసం జరిగిన పోరాటం ఆరోగ్యశ్రీ వంటి పథకానికి బాటలు వేస్తే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సాగిన మహోద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారితీసింది. అదే స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాగిన పాదయాత్ర కూడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. *ఒక చిన్నారి కోసం సాగిన పోరాటం* వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న సమయంలో, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి నివాసం ఎదుట ధర్నా నిర్వహించి ఆ చిన్నారికి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆ పోరాటానికి స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వైద్య భరోసా కల్పించే ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకరి సమస్య కోసం జరిగిన పోరాటం లక్షలాది పేదలకు ఆరోగ్య భరోసాగా మారడం ప్రజా ఉద్యమాల శక్తికి నిదర్శనం. *తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర సాధన* ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయనే ఆవేదనతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపిన కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఘనత కూడా కాంగ్రెస్ జాబితాలో చేరింది. ప్రజల ఆకాంక్షల కోసం సాగిన పోరాటాలు చివరకు పాలకులను నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయనడానికి ఇవి చారిత్రక ఉదాహరణలు. *కలంతో పోరాడే జర్నలిస్టుల వ్యథ* గత మూడు దశాబ్దాలుగా కలాన్ని చేతపట్టి అసమానతలు, అవరోధాలు, అన్యాయాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల జీవితం ఎన్నో కష్టాలతో సాగుతోంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా బాహ్య ప్రపంచంలో తమ బాధలను మునిపంటి కింద పెట్టుకుని సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడే జర్నలిస్టుల్లోనే అనేక మంది నేడు సొంత ఇల్లు, గూడు లేకుండా జీవించడం బాధాకరం. *ఇళ్ల స్థలాల కోసం కలం వీరుల పాదయాత్ర* ఇలాంటి నిరుపేద, గూడు లేని జర్నలిస్టుల హక్కుల కోసం నినదిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ చేపట్టిన పాదయాత్ర వీరోచిత, సాహసోపేత పోరాటంగా నిలిచింది. షహీద్ షోయబుల్లాఖాన్ అక్షర స్ఫూర్తిగా సాగిన ఈ పాదయాత్ర ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇళ్ల స్థలాల సాధన కోసం సాగిన ఈ ‘కలం వీరుల కథనయాత్ర’ జర్నలిస్టుల హక్కుల ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. *పాదయాత్ర ముగిసినా.. పోరాట స్ఫూర్తి కొనసాగాలి* పాదయాత్ర ముగింపు సభతో కార్యక్రమం ముగిసినా, దాని స్ఫూర్తి మాత్రం ముగియలేదు. ఖమ్మం జిల్లా జర్నలిస్టుల్లో చైతన్యాన్ని, పోరాటపటిమను రగిలించడం, హక్కుల సాధన కోసం సంఘటితంగా ప్రశ్నించే ధైర్యాన్ని నింపడం ఈ యాత్ర సాధించిన ప్రధాన విజయం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగించాలనే సంకల్పాన్ని బలపరిచిన ఈ పాదయాత్ర ఫెడరేషన్ చరిత్రలోనే కాదు, జర్నలిస్టుల ఉద్యమ చరిత్రలోనూ ఒక సువర్ణ అధ్యాయంగా శాశ్వతంగా నిలిచిపోతుంది.

*ఫెడరేషన్ పాదయాత్ర ఒక సువర్ణ అధ్యాయం*

*ప్రజా ఉద్యమాలే మార్పుకు పునాది*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగిన ఉద్యమాలు చరిత్రలో సువర్ణ అధ్యాయాలుగా నిలిచాయి. ఒక చిన్నారి ప్రాణాల కోసం జరిగిన పోరాటం ఆరోగ్యశ్రీ వంటి పథకానికి బాటలు వేస్తే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సాగిన మహోద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధనకు దారితీసింది. అదే స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సాగిన పాదయాత్ర కూడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది.

*ఒక చిన్నారి కోసం సాగిన పోరాటం*

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ చిన్నారి హృద్రోగ సమస్యతో బాధపడుతున్న సమయంలో, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి నివాసం ఎదుట ధర్నా నిర్వహించి ఆ చిన్నారికి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఆ పోరాటానికి స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వైద్య భరోసా కల్పించే ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకరి సమస్య కోసం జరిగిన పోరాటం లక్షలాది పేదలకు ఆరోగ్య భరోసాగా మారడం ప్రజా ఉద్యమాల శక్తికి నిదర్శనం.

*తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర సాధన*

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయనే ఆవేదనతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపిన కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఘనత కూడా కాంగ్రెస్ జాబితాలో చేరింది. ప్రజల ఆకాంక్షల కోసం సాగిన పోరాటాలు చివరకు పాలకులను నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయనడానికి ఇవి చారిత్రక ఉదాహరణలు.

*కలంతో పోరాడే జర్నలిస్టుల వ్యథ*

గత మూడు దశాబ్దాలుగా కలాన్ని చేతపట్టి అసమానతలు, అవరోధాలు, అన్యాయాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల జీవితం ఎన్నో కష్టాలతో సాగుతోంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా బాహ్య ప్రపంచంలో తమ బాధలను మునిపంటి కింద పెట్టుకుని సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడే జర్నలిస్టుల్లోనే అనేక మంది నేడు సొంత ఇల్లు, గూడు లేకుండా జీవించడం బాధాకరం.

*ఇళ్ల స్థలాల కోసం కలం వీరుల పాదయాత్ర*

ఇలాంటి నిరుపేద, గూడు లేని జర్నలిస్టుల హక్కుల కోసం నినదిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ చేపట్టిన పాదయాత్ర వీరోచిత, సాహసోపేత పోరాటంగా నిలిచింది. షహీద్ షోయబుల్లాఖాన్ అక్షర స్ఫూర్తిగా సాగిన ఈ పాదయాత్ర ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇళ్ల స్థలాల సాధన కోసం సాగిన ఈ ‘కలం వీరుల కథనయాత్ర’ జర్నలిస్టుల హక్కుల ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది.

*పాదయాత్ర ముగిసినా.. పోరాట స్ఫూర్తి కొనసాగాలి*

పాదయాత్ర ముగింపు సభతో కార్యక్రమం ముగిసినా, దాని స్ఫూర్తి మాత్రం ముగియలేదు. ఖమ్మం జిల్లా జర్నలిస్టుల్లో చైతన్యాన్ని, పోరాటపటిమను రగిలించడం, హక్కుల సాధన కోసం సంఘటితంగా ప్రశ్నించే ధైర్యాన్ని నింపడం ఈ యాత్ర సాధించిన ప్రధాన విజయం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగించాలనే సంకల్పాన్ని బలపరిచిన ఈ పాదయాత్ర ఫెడరేషన్ చరిత్రలోనే కాదు, జర్నలిస్టుల ఉద్యమ చరిత్రలోనూ ఒక సువర్ణ అధ్యాయంగా శాశ్వతంగా నిలిచిపోతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.