ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మద్దతుగా ఖమ్మంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శాసనాల సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ ఉదయ్ ప్రతాప్, బీజేపీ మాజీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుతా వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు నాకిరికంటి వీరభద్రం, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మందా సరస్వతి, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు అనంతు ఉపేందర్‌రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావు గౌడ్, జిల్లా నాయకులు పిల్లలమర్రి వెంకట్, యువమోర్చా నాయకులు నల్లమాస శ్రీనివాస్, దీకొండ శ్యామ్ సుందర్, వల్లాల రమేష్ యాదవ్, యెలిసెట్టి మణికంఠ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా తక్షణమే బకాయిలను చెల్లించాలని వారు కోరారు.



