Tuesday, 12 May 2026
  • Home  
  • ప్రయాణికుల దాహాన్ని తీర్చిన ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ, నల్ల మల్ల రంజిత్
- ఖమ్మం

ప్రయాణికుల దాహాన్ని తీర్చిన ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ, నల్ల మల్ల రంజిత్

ఖమ్మం, మే 12 (పున్నమి జిల్లా ఇంచార్జి) వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ఖమ్మంలో స్థానిక పాత బస్ స్టాండ్ దగ్గర నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని 500 మంది ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. మండుటెండల్లో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి బాలయ్య అభిమాన సంఘం నాయకుడు నల్లమల్ల రంజిత్ ని , అలాగే పాల్గొన్న ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు నందమూరి బాలయ్య అభిమానులు మధు, తారక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, మే 12
(పున్నమి జిల్లా ఇంచార్జి)

వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహాన్ని తీర్చేందుకు ఖమ్మంలో స్థానిక పాత బస్ స్టాండ్ దగ్గర నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని 500 మంది ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. మండుటెండల్లో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి బాలయ్య అభిమాన సంఘం నాయకుడు నల్లమల్ల రంజిత్ ని , అలాగే పాల్గొన్న ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు నందమూరి బాలయ్య అభిమానులు
మధు, తారక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.