✍️ రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ప్రముఖ దర్శకులు భారతీరాజా మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు అని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన మహోన్నత దర్శకుడు భారతీరాజా అని కొనియాడారు.ఎందరో నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ‘దర్శక శిఖరం’ భారతీరాజా అన్నారు. చిత్రసీమలో ఒక అద్భుత శకం ముగిసిందని, ఆయన మరణంతో చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినిమా అంటే కేవలం గ్లామర్ కాదు.. అచ్చమైన మట్టి వాసన’ అని నిరూపించిన సృజనశీలి భారతీరాజా అని గుర్తుచేసుకున్నారు. తరాలు మారినా తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో భారతీరాజా గారి ముద్ర చెరిగిపోనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ భగవంతుణ్ణి ప్రార్థించారు.
End



