*ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామంలో డ్రైనేజీ క్లీనింగ్ – వర్షాకాలానికి ముందే పంచాయతీ చర్యలు*
మే 11 పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావు సింగ్ నాయక్
ఏన్కూరు
గార్ల ఒడ్డు గ్రామపంచాయతీ
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీ క్లీనింగ్ పనులు వేగవంతం చేశారు. గురువారం ఉదయం గ్రామంలోని ప్రధాన వీధుల వెంట పూడిక తీసే పనులు చేపట్టారు.
సర్పంచ్, భుక్య నర్సి లాలు నాయక్
పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు.
గ్రామ పంచాయతీ కార్మికులు చేతితోనే డ్రైనేజీల్లో పూడిక తీసి, చెత్తను తొలగిస్తున్నారు. ఇరువైపులా పేరుకుపోయిన మట్టిని తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచే సమస్య తగ్గుతుందని, దోమల బెడద కూడా తగ్గుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ అధికారులు మాట్లాడుతూ, గ్రామంలోని అన్ని వార్డుల్లో దశలవారీగా డ్రైనేజీలను శుభ్రం చేస్తామని, ప్రజలు చెత్తను డస్ట్బిన్లోనే వేయాలని సూచించారు.

