కొండాపురం మండలం, గొట్టిగుండాల గ్రామానికి చెందిన యర్రజాల విజయ్ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి నెల్లూరులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎలాంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. విజయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, చికిత్సకు అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.10,000/-లను ఆర్థిక సహాయంగా బాధిత కుటుంబానికి అందజేసిన ఎమ్మెల్యే , భవిష్యత్తులో అవసరమైన వైద్య ఖర్చులకు కూడా తన వంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందించి అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదంలో గాయపడిన యువకుడికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..!