బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ 7వ వార్డ్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీసీపీ భాస్కర్ గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపై, ఆరోగ్యంపై కుటుంబ వ్యవస్థపై అది చూపే ప్రతికూల ప్రభావాల గురించి వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని సూచించారు. మహిళల భద్రత కోసం చేపడుతున్న చర్యలను వివరించి, మహిళలు వేధింపులు ఎదురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్, స్థానిక ప్రజలు, యువత, మహిళలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




