జోస్ లుకాస్ రెండో వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు సంస్థ యాజమాన్యం విరాళాలు అందజేసింది. జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్‌కు రూ.1.10 లక్షలు, నాగరాజుపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌కు రూ.1.40 లక్షలు, ఎంపీఎల్ క్రాస్ ఉర్దూ హైస్కూల్‌కు రూ.1.70 లక్షలు, ఖాజీపేట జడ్పీ హైస్కూల్‌కు రూ.1.60 లక్షల చొప్పున చెక్కులను అందించారు. ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ చేతుల మీదుగా ఈ విరాళాలు అందజేశారు. అనంతరం వార్షికోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేశారు.


