*ప్రధానమంత్రి మోదీజీ పై వీడియో ప్రదర్శన వీక్షించిన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డికె అరుణ*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 25/04/2026*
*నడిగడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయుడు టీ నాగేందర్ కుమార్, స్వీయ రచనలో మరియు సలహాదారులు ఎం ఎన్ విజయకుమార్ గారి సహాయ సహకారాలతో రచించిన “మేరా భారత్ మహాన్ తూ హై భారత్ కి జవాన్.. సైనికుడు సేవకుడు రక్షకుడు సంరక్షకుడు”… అనే నాలుగు నిమిషాల వ్యవధి రూపంలో వీడియో నిర్మించి ప్రధానమంత్రి మోడీజీ పై ఉన్న తన భక్తిని చాటుకున్నాడని చాలా అద్భుతంగా ఉన్నదని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారు వారిని అభినందించారు. వీడియో ప్రదర్శన అధ్యంతం చూపర్లని ఆకట్టుకున్నది ఆయన చేసిన రచన చాలా అద్భుతంగా ఉన్నదని ప్రేక్షకులు అభినందించారు, అవకాశం ఇచ్చిన ఎంపి సలహాదారులు రవీందర్ రెడ్డి కి నిర్వాహకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు*


