ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: అల్లూరు వెంకటసాయి కుమార్
నెల్లూరు: పున్నమి తెలుగు దినపత్రిక రిపోర్టర్ అల్లూరు వెంకటసాయి కుమార్ మాట్లాడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పున్నమి ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చే బాధ్యతతో పనిచేస్తానని పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమన్వయంగా పనిచేస్తూ పున్నమి తెలుగు దినపత్రికను ప్రజలకు మరింత చేరువ చేస్తానని చెప్పారు.
భవిష్యత్తులో నెల్లూరు రూరల్ ఇంచార్జ్‌గా ఎదిగి, సంస్థ అభివృద్ధికి మరింత కృషి చేయడంతో పాటు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యతాయుత పాత్రికేయుడిగా సేవలందించడమే తన జీవిత లక్ష్యమని అల్లూరు వెంకటసాయి కుమార్ తెలిపారు.


