రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 14, టౌన్ ప్లానింగ్ 10, రెవెన్యూ 04, ఇంజనీరింగ్ 05, హెచ్ సెక్షన్ 01, పబ్లిక్ హెల్త్ 02, పెన్షన్ 01, మొత్తం 37 వినతులను మేయర్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం రహంతు జానీ, ఈ.ఈ లు శేషగిరిరావు, అనిల్ కుమార్, చంద్రయ్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





