శ్రీ కాళహస్తి, జులై 23, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి లోని ప్రజా సంక్షేమానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తిలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ (ప్రజా ఫిర్యాదుల) కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను, కార్యకర్తలను నేరుగా కలుసుకుని, వారి వ్యక్తిగత, గ్రామ స్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి ఒక్క అర్జీని, వినతిపత్రాన్ని నిశితంగా పరిశీలించిన ఎమ్మెల్యే, బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తక్షణమే పరిష్కరించాల్సిన కొన్ని అత్యవసర సమస్యలపై ఆయన సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, క్షేత్రస్థాయిలో వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్పష్టం చేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, పలు శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి