Sunday, 26 July 2026
  • Home  
  • ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
- ఖమ్మం

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జులై 25 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం.. ప్రజా వ్యతిరేక పాలకులకు చెంపపెట్టు – మాజీ మంత్రి పువ్వాడ ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల పోరాటం, సాధించిన విజయం చెంపపెట్టు వంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం ఒక సమస్య పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలో మార్పును కోరుకునే యువత సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. విద్యార్థులు, యువత ఆశయాలను విస్మరిస్తూ పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉద్యమం తీవ్రమైన హెచ్చరికగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాలను ప్రజలు సహించరని వారికి గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఈ విజయం మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. ఇకపై విద్యార్థులు, యువత సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో స్పందించి, ప్రజా సంక్షేమం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

జులై 25 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:
విద్యార్థుల విజయం మార్పుకు సంకేతం.. ప్రజా వ్యతిరేక పాలకులకు చెంపపెట్టు – మాజీ మంత్రి పువ్వాడ

ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థుల పోరాటం, సాధించిన విజయం చెంపపెట్టు వంటిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ పోరాటం కేవలం ఒక సమస్య పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలో మార్పును కోరుకునే యువత సంకల్పానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. విద్యార్థులు, యువత ఆశయాలను విస్మరిస్తూ పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఉద్యమం తీవ్రమైన హెచ్చరికగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వాలను ప్రజలు సహించరని వారికి గుణపాఠం చెబుతారనే విషయాన్ని ఈ విజయం మరోసారి స్పష్టం చేసిందని అన్నారు. ఇకపై విద్యార్థులు, యువత సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో స్పందించి, ప్రజా సంక్షేమం, విద్యా అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.