ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం టూ టౌన్ బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ జీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన SIR (Special Intensive Revision) హెల్ప్ డెస్క్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయని టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ, ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ తెలిపారు.
జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, సీనియర్ నాయకుడు గెంటెల విద్యాసాగర్ ప్రారంభించిన ఈ హెల్ప్ డెస్క్‌లను కొత్త బస్టాండ్, కార్పొరేషన్ కార్యాలయం, ఫ్రీడమ్ పార్క్, ఎన్‌టీఆర్ పార్క్ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు SIR దరఖాస్తుల నింపడం, అవసరమైన వివరాలు అందించడం, పూర్తి చేసిన పత్రాలను సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLOలు) అందజేయడం వంటి సేవలు అందించారు.
గత కొన్ని రోజులుగా కొనసాగిన ఈ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతి ఒక్కరూ తమ SIR ప్రక్రియను పూర్తి చేసుకునేలా పార్టీ నాయకులు సహకరించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ధనియాకుల శ్రీలత, దాసరి వీరభద్రం, భూక్యా శ్యాంసుందర్ నాయక్, పాశం శ్రీనివాస్ రెడ్డి వీరెలి రాజేష్ గుప్తా, జిల్లెల నాగరాజుతో పాటు పలువురు ముఖ్య నాయకులు హెల్ప్ డెస్క్‌లను సందర్శించి నిర్వాహకులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.



