చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో శనివారం పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చెన్నారావుపేట ఐసీడిఎస్ సూపర్వైజర్ కే. రాధ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యం తీసుకురావడమే పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్ చిలపాక అనిత మొగిలి మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజూ ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పి. విజయలక్ష్మి, బి. రజిత, ఎం. సరోజన,ANM రమ, ఆయాలు ఏ. నీలమ్మ, కట్టమ్మ, శారద, తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

పోషకాహరంతోనే ఆరోగ్యకరమైన సమాజం ఐసీడిఎస్ సూపర్వైజర్ రాధ