*పోలీసులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరిక*
*బీఆర్ఎస్ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం: పువ్వాడ*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పోలీసు అధికారిని ఊరుకునేది లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గం జూలూరుపాడులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో విధులు నిర్వహించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పోలీసులు హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
భవిష్యత్తులో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు చర్యలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. సరైన విధులు నిర్వహించి తగిన రీతిలో పనిచేయాలని పోలీసులకు హితవు పలికారు.


