Sunday, 23 August 2026
  • Home  
  • పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డు అందుకున్న- మోతే కృష్ణ*
- BHADRADRI

పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డు అందుకున్న- మోతే కృష్ణ*

భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి వార్తలు చుంచుపల్లి మండలం 23/08/2026 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ప్రగడ కోటయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి మన పొన్నూరు వెల్ఫేర్ అసోసియేషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న సంస్థలను గుర్తించి వారికి ఘనంగా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కు చెందిన మన యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ మరియు ఐక్య తల్లిదండ్రుల సంఘం తరుపున చేస్తున్న రక్తదాన మరియు ఇతర సామాజిక సేవ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తించి ఈ అవార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డు కార్యక్రమానికి మన యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజర్ మోతే కృష్ణ గారు పాల్గొని ముఖ్య అతిథిగా వంగవీటి మోహన రంగా కూతురు శ్రీమతి వంగవీటి ఆశాకిరణ్ గారు మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు ను స్వీకరించడం జరిగింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినటువంటి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమలశెట్టి ఉమా శంకర్ అన్న గారికి మిగతా సభ్యులందరికి మన గ్రూప్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము . సేవ చేయాలంటే ధనమే అవసరం లేదు సహాయం చేసే గుణం ఉంటే చాలు అనే నినాదం తో రక్త దానం చేస్తున్నటువంటి మన గ్రూప్ సభ్యులందరికీ పేరుపేరునా అంకితం ఇస్తున్నట్లు మోతే కృష్ణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్కే పాషా, మేకల నితిన్, మూడ్ మోహన్, కొమ్ము రమేష్ పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి వార్తలు చుంచుపల్లి మండలం 23/08/2026
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ప్రగడ కోటయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి మన పొన్నూరు వెల్ఫేర్ అసోసియేషన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న సంస్థలను గుర్తించి వారికి ఘనంగా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కు చెందిన మన యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ మరియు ఐక్య తల్లిదండ్రుల సంఘం తరుపున చేస్తున్న రక్తదాన మరియు ఇతర సామాజిక సేవ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తించి ఈ అవార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డు కార్యక్రమానికి మన యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజర్ మోతే కృష్ణ గారు పాల్గొని ముఖ్య అతిథిగా వంగవీటి మోహన రంగా కూతురు శ్రీమతి వంగవీటి ఆశాకిరణ్ గారు మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు ను స్వీకరించడం జరిగింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినటువంటి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమలశెట్టి ఉమా శంకర్ అన్న గారికి మిగతా సభ్యులందరికి మన గ్రూప్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము . సేవ చేయాలంటే ధనమే అవసరం లేదు సహాయం చేసే గుణం ఉంటే చాలు అనే నినాదం తో రక్త దానం చేస్తున్నటువంటి మన గ్రూప్ సభ్యులందరికీ పేరుపేరునా అంకితం ఇస్తున్నట్లు మోతే కృష్ణ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్కే పాషా, మేకల నితిన్, మూడ్ మోహన్, కొమ్ము రమేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.