ఖమ్మం, జూన్ 17
(పువ్వాడ నాగేంద్ర కుమార్ – పున్నమి జిల్లా రిపోర్టర్)
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పొంగులేటి సుధాకర్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ స్వాగత కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్, బీజేపీ ఖమ్మం జిల్లా ఎడ్యుకేషన్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు, వీరభద్ర ప్రసాద్, కొనతం లక్ష్మీనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



