జూన్ 26
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
పేరు మార్చి అడ్మిషన్ల దందా.. DEOను సస్పెండ్ చేయాలి, MEOను సర్వీస్ నుండి తొలగించాలి: మూడ్ బాలాజీ నాయక్ డిమాండ్
కొత్తగూడెం:
చుంచుపల్లి మండలం రామవరం (SCB నగర్)లో Bharat Public School, SR Prime School, ప్రస్తుతం Prime School CBSE పేర్లతో నిబంధనలకు విరుద్ధంగా విద్యా కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని గిరిజన విద్యార్థి సంఘం (GVS) జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. SR Prime Schoolకు స్వతంత్ర CBSE అఫిలియేషన్ లేకపోయినప్పటికీ “CBSE” పేరుతో అక్రమంగా అడ్మిషన్లు, తప్పుడు ప్రచారం, భారీ ఫీజుల వసూళ్లు నిర్వహిస్తున్నారని, ఒకే భవనంలో వేర్వేరు పేర్లతో పాఠశాలలు నడిపినట్లు తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని స్పష్టమైన ఆధారాలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, జిల్లా విద్యాశాఖ అధికారులకు సమర్పించినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు చుంచుపల్లి MEO ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దళారులు ఇచ్చే కాసులకు ఆశపడి, వారు ఇచ్చే పైసలకు లోబడి జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి కొమ్ముకాస్తూ విద్యార్థుల జీవితాలతో, తల్లిదండ్రుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని బాలాజీ నాయక్ మండిపడ్డారు.
SR Prime School 2023 సంవత్సరం తర్వాత నడవడం లేదని స్వయంగా MEO తన నివేదికలో పేర్కొన్నప్పటికీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు SR PRIME SCHOOL, భారత్ పబ్లిక్ స్కూల్ కాంప్లెక్స్ పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతోందన్నారు. ప్రస్తుతం 2026 విద్యా సంవత్సరంలో కూడా ఎలాంటి అధికారిక అఫిలియేషన్ లేకుండానే, అనాధికారిక కార్యకలాపాలు సాగిస్తూ Prime School CBSE పేరుతో కొత్త అడ్మిషన్లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని, ఇదంతా అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ దందాలపై అధికారుల మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటని నిలదీశారు. ఈ మొత్తం అంశంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యుల కమిటీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు DEO కార్యాలయం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివేదికను తొక్కిపెట్టిందని, కొత్త అడ్మిషన్లు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో, అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తూ విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)ని తక్షణమే సస్పెండ్ చేయాలని, క్షేత్రస్థాయిలో విఫలమై ప్రైవేట్ యాజమాన్యాలకు అండగా నిలుస్తున్న చుంచుపల్లి MEOను సర్వీస్ నుండి తొలగించాలని (Removal from Service) మూడ్ బాలాజీ నాయక్ డిమాండ్ చేశారు. తప్పుడు CBSE ప్రచారం, నిరంతర పేర్ల మార్పు, సర్టిఫికెట్ల జారీ, గిరిజన ప్రాంత నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని అక్రమ అడ్మిషన్లను నిలిపివేయాలని, లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన ఉన్నత స్థాయి చట్టపరమైన పోరాటాన్ని, ఉధృతమైన ఉద్యమాన్ని కొనసాగిస్తామని మూడ్ బాలాజీ నాయక్
జాతీయ ప్రధాన కార్యదర్శి,
గిరిజన విద్యార్థి సంఘం (GVS)
హెచ్చరించారు.


