బైంసా, (ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి)
పురుగుమందుల పిచికారీ సమయంలో రైతులు నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, కృష్ణ నర్సింగ్ హోమ్, భైంసా హెచ్చరించారు. ముధోల్ తాలూకా రైతులకు అవగాహన కల్పిస్తూ, పిచికారీ సమయంలో మాస్క్, గ్లౌవ్స్, రక్షణ దుస్తులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
పురుగుమందులను నేరుగా చేతులతో కలపకుండా, గాలి దిశకు వ్యతిరేకంగా నిలబడి పిచికారీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిచికారీ అనంతరం చేతులు, ముఖం, శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలని, ఆ సమయంలో ఆహారం, నీరు, పొగతాగడం వంటివి చేయకూడదన్నారు.
తలతిరగడం, వాంతులు, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ సూచించారు. రైతుల ఆరోగ్య రక్షణకు అప్రమత్తతే తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు.

పురుగుమందుల పిచికారీలో అప్రమత్తతే రక్షణ
బైంసా, (ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి) పురుగుమందుల పిచికారీ సమయంలో రైతులు నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, కృష్ణ నర్సింగ్ హోమ్, భైంసా హెచ్చరించారు. ముధోల్ తాలూకా రైతులకు అవగాహన కల్పిస్తూ, పిచికారీ సమయంలో మాస్క్, గ్లౌవ్స్, రక్షణ దుస్తులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పురుగుమందులను నేరుగా చేతులతో కలపకుండా, గాలి దిశకు వ్యతిరేకంగా నిలబడి పిచికారీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిచికారీ అనంతరం చేతులు, ముఖం, శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలని, ఆ సమయంలో ఆహారం, నీరు, పొగతాగడం వంటివి చేయకూడదన్నారు. తలతిరగడం, వాంతులు, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ సూచించారు. రైతుల ఆరోగ్య రక్షణకు అప్రమత్తతే తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారు.

