Saturday, 15 August 2026
  • Home  
  • పాలకొండరాయస్వామి సన్నిధిలో శ్రావణమాస అన్నదాన మహోత్సవం
- కడప

పాలకొండరాయస్వామి సన్నిధిలో శ్రావణమాస అన్నదాన మహోత్సవం

పాలకొండరాయస్వామి సన్నిధిలో శ్రావణమాస అన్నదాన మహోత్సవం పున్నమి ప్రతినిధి | పాలకొండరాయస్వామి ఆలయం, ఆగస్టు 14: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ పాలకొండరాయస్వామి వారి సన్నిధిలో అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ నాల్గవ శనివారం వరకు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది. శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పవిత్ర అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రీ పాలకొండరాయస్వామి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పాలకొండరాయస్వామి సన్నిధిలో శ్రావణమాస అన్నదాన మహోత్సవం

పున్నమి ప్రతినిధి | పాలకొండరాయస్వామి ఆలయం, ఆగస్టు 14: పవిత్ర శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీ పాలకొండరాయస్వామి వారి సన్నిధిలో అన్నదాన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు 15వ తేదీ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ నాల్గవ శనివారం వరకు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది.

శ్రీ ఏటూరు రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పవిత్ర అన్నదాన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని నిర్వాహకులు కోరారు.

అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రీ పాలకొండరాయస్వామి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.