విశాఖపట్నం జిల్లా, మధురవాడ, (పున్నమి ప్రతినిధి) , ఆగస్టు 17:
“కీర్తించే పేరు వద్దు.. ఆశించే పదవి వద్దు.. శాసించే స్థానం వద్దు.. నిత్యం పార్టీ సేవ చేయడమే నా జీవితానికి సరిహద్దు” అనే నిబద్ధతతో టీడీపీ శంకర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఆగస్టు 17న మధురవాడ సునీల్ శర్మ కాలనీలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భీమిలి నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ఏడో వార్డు పరిధిలో 303వ బూత్ కమిటీ ఇన్చార్జిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న శంకర్, అప్పగించిన పనులను నిబద్ధతతో నిర్వహిస్తూ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటున్నారు.
బ్రతుకుతెరువు కోసం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూనే పార్టీ సేవకు సమయం కేటాయిస్తున్నారు. అలాగే మధురవాడ సునీల్ శర్మ కాలనీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల కమిటీ చైర్మన్గా పాఠశాల అభివృద్ధికి సేవలందిస్తున్నారు. ఆయన సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.



