Friday, 2 October 2026
  • Home  
  • *ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం* : *ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం* : *ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ స్పష్టం చేశారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ,సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కాకినాడ నాగమల్లితోట సెంటర్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డు) లోని ‘సత్కళావాహిని’లో ప్రత్యేక వేడుకలను ఘనంగా నిర్వహించారు.సంఘం అధ్యక్షుడు బుద్ధరాజు (వరదరాజు) సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వై.డి. రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజానికి, కుటుంబానికి పెద్దలైన వృద్ధులను గౌరవించి ఆసరాగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వృద్ధులు తమ జీవితానుభవాలను నేటి తరానికి అందించి సమాజాభివృద్ధికి మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు.జీవితంలో క్రమశిక్షణ ఉంటే ఎంతటి బాధ్యతలైనా సమర్థవంతంగా నిర్వర్తించవచ్చనడానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు నిదర్శనమన్నారు.కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వృద్ధులు ఆర్డీవోలను సంప్రదించి చట్టబద్ధమైన పరిష్కారం పొందవచ్చని సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) వై. శ్రీనివాస్ శాఖాపరమైన నివేదికను సమర్పిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 6,31,400 మంది (12.25 శాతం) ఉన్నారని తెలిపారు. వృద్ధులకు సామాజిక పింఛన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సహాయ జీవన పరికరాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన సీనియర్ సిటిజన్లకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు బి.ఎస్.ఎన్. మూర్తి, ప్రముఖులు వి. గోపాల నరసరాజు, అడబాల రత్నప్రసాద్, ఆచంట రామారాయుడు, శాఖ సిబ్బంది మరియు పలువురు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1 (పున్నమి న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ స్పష్టం చేశారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ,సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కాకినాడ నాగమల్లితోట సెంటర్‌ (ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డు) లోని ‘సత్కళావాహిని’లో ప్రత్యేక వేడుకలను ఘనంగా నిర్వహించారు.సంఘం అధ్యక్షుడు బుద్ధరాజు (వరదరాజు) సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వై.డి. రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజానికి, కుటుంబానికి పెద్దలైన వృద్ధులను గౌరవించి ఆసరాగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.వృద్ధులు తమ జీవితానుభవాలను నేటి తరానికి అందించి సమాజాభివృద్ధికి మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు.జీవితంలో క్రమశిక్షణ ఉంటే ఎంతటి బాధ్యతలైనా సమర్థవంతంగా నిర్వర్తించవచ్చనడానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు నిదర్శనమన్నారు.కుటుంబ సభ్యుల నుంచి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వృద్ధులు ఆర్డీవోలను సంప్రదించి చట్టబద్ధమైన పరిష్కారం పొందవచ్చని సూచించారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) వై. శ్రీనివాస్ శాఖాపరమైన నివేదికను సమర్పిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 ఏళ్లు పైబడిన వారు సుమారు 6,31,400 మంది (12.25 శాతం) ఉన్నారని తెలిపారు. వృద్ధులకు సామాజిక పింఛన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో సహాయ జీవన పరికరాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
అనంతరం దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన సీనియర్ సిటిజన్లకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు బి.ఎస్.ఎన్. మూర్తి, ప్రముఖులు వి. గోపాల నరసరాజు, అడబాల రత్నప్రసాద్, ఆచంట రామారాయుడు, శాఖ సిబ్బంది మరియు పలువురు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.