నర్సంపేట నియోజకవర్గ ఖానాపూర్ మండలంలోని
పాకాల చెరువు డబ్బా వాగు చెక్ డ్యామ్ ను మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు పూర్తిగా నిండక ముందే నీటిని ఆపేయడం వల్ల కిందటి పంటలకు, తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. రైతులకు నీరు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వెంటనే పాకాల చెరువులోకి తిరిగి నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రామస్వామి ఉపేందర్ రెడ్డి కోరే సుధాకర్ బుస అశోక్ యాదవ్ కోరే రాము ముద్దంగుల సంపత్ నరేష్ స్థానిక బిఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.



