పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పోలీస్ సిబ్బంది మీడియాతో మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా పత్రికలు, టీవీ లేదా ఇతర మీడియా వేదికల్లో సమాచారాన్ని పంచుకోవద్దని స్పష్టం చేసింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, సంబంధాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం కూడా నిషేధించబడింది. ఈ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే చర్యగా అభివర్ణించింది. ప్రభుత్వ ఉద్యోగుల స్వేచ్ఛను కట్టడి చేయడమే లక్ష్యమని విమర్శించింది. మరోవైపు ఎన్నికల అనంతర శాంతి భద్రతల కోసం కేంద్ర బలగాల మోహరింపును కూడా పొడిగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమ బెంగాల్లో మీడియాతో మాట్లాడొద్దని ఆదేశాలు