నెల్లూరు జిల్లా: జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లాలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పోలీస్ అధికారులు ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై సమస్యలను తెలుసుకుంటున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, అనుమానాస్పద ఫోన్ కాల్స్‌పై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే మహిళలు, బాలల భద్రత, పిల్లల విద్య ప్రాముఖ్యత, మత్తు పదార్థాల నివారణపై చైతన్యం కల్పించారు. పోలీస్-ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.



