Saturday, 19 September 2026
  • Home  
  • పడమటిపాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సు.. చట్టాలపై ప్రజలకు అవగాహన.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పడమటిపాలెంలో న్యాయ విజ్ఞాన సదస్సు.. చట్టాలపై ప్రజలకు అవగాహన.

సంగం సెప్టెంబర్ 17 ( పున్నమి ప్రతినిధి ) పడమటిపాలెం: సంగం మండలం పడమటిపాలెంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ హాజరై ప్రజలకు చట్టపరమైన హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి అందించే ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవల వివరాలను అధికారులు వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సంగం తహశీల్దార్ సారంగపాణి, ఎస్ఐ భోజ్యా నాయక్, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంగం సెప్టెంబర్ 17 ( పున్నమి ప్రతినిధి )

పడమటిపాలెం: సంగం మండలం పడమటిపాలెంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ హాజరై ప్రజలకు చట్టపరమైన హక్కులు, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి అందించే ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవల వివరాలను అధికారులు వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సంగం తహశీల్దార్ సారంగపాణి, ఎస్ఐ భోజ్యా నాయక్, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.