సోమశిల సెప్టెంబర్ 17 ( పున్నమి ప్రతినిధి,)
సోమశిల జలాశయం నుంచి డెల్టా ప్రాంతానికి నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వ రోజురోజుకూ తగ్గుతోంది. గురువారం నాటికి జలాశయంలో 15.270 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కాలువకు మాత్రమే 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డెల్టాకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు తగ్గిపోతుండటంతో వచ్చే రబీ సాగుకు సైతం నీరు అందకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు వస్తే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.


