ఆత్మకూరు: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బాధితులు ఆత్మకూరు ఆర్డీవో బి.పావనికి ఫిర్యాదు చేశారు. జనసేన నేత నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బాధితులు ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లుల సొమ్ముతో పాటు తమ వద్ద నుంచి అదనంగా నగదు తీసుకున్న కాంట్రాక్టర్లు, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. దాదాపు 700 ఇళ్లకు సంబంధించి ఇదే విధమైన సమస్య ఉందని తెలిపారు. తమకు జరిగిన నష్టంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆర్డీవోను కోరారు. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

జగనన్న కాలనీలో అవకతవకలు.. ఆర్డీవోకు బాధితుల ఫిర్యాదు