ఆత్మకూరు మున్సిపాలిటీ నెల్లూరుపాలెం వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వింజమూరు నుంచి వస్తున్న కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి టిప్పర్ వేగమే కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



