నెల్లూరు నగరంలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక నిఘా.
జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య సూచనలతో, నెల్లూరు నగరంలో రాత్రి సమయంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు నెల్లూరు పోలీసులు. ఈ నేపథ్యంలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కో ఎస్.ఐ మరియు ప్రత్యేక సిబ్బంది బృందంను నియమించి, రాత్రి పూట కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం. ఓపెన్ డ్రింకింగ్ పై కఠిన చర్యలు, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తించి విచారణ, కౌన్సెలింగ్ వాహనాల విస్తృత తనిఖీలు (Vehicle Checking Drives) లాడ్జీలు, లాడ్జింగ్ హౌసులు, గెస్ట్ హౌసులపై ప్రత్యేక తనిఖీలు, రాత్రి వేళల్లో ఎక్కువగా జరిగే అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి, ఈ చర్యల ద్వారా నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు.
రాత్రి వేళల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నగర ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే 112 కు గాని, కంట్రోల్ రూమ్ 9392903413 నకు గాని, సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. నెల్లూరు నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల ద్వారా నియంత్రణ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు.

నెల్లూరు నగరం రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
నెల్లూరు నగరంలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య సూచనలతో, నెల్లూరు నగరంలో రాత్రి సమయంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు నెల్లూరు పోలీసులు. ఈ నేపథ్యంలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కో ఎస్.ఐ మరియు ప్రత్యేక సిబ్బంది బృందంను నియమించి, రాత్రి పూట కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించడం. ఓపెన్ డ్రింకింగ్ పై కఠిన చర్యలు, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తించి విచారణ, కౌన్సెలింగ్ వాహనాల విస్తృత తనిఖీలు (Vehicle Checking Drives) లాడ్జీలు, లాడ్జింగ్ హౌసులు, గెస్ట్ హౌసులపై ప్రత్యేక తనిఖీలు, రాత్రి వేళల్లో ఎక్కువగా జరిగే అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి, ఈ చర్యల ద్వారా నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. రాత్రి వేళల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. నగర ప్రజలు పోలీసులకు సహకరించి, అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే 112 కు గాని, కంట్రోల్ రూమ్ 9392903413 నకు గాని, సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. నెల్లూరు నగరంలో శాంతి భద్రతలను కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల ద్వారా నియంత్రణ కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు.

