నెల్లూరు
దుత్తలూరు
Date02-5-2026
(ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్కు చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని CH . కరీనాను(594/600) జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా అభినందించారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో అద్భుతమైన మార్కులు సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చిన సందర్భంగా ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి బాలాజీ గారు, MEO-1 ఫాజిల్ గారు, గణిత ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు గారు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కిరణ్ గారు, విద్యార్థిని తల్లిదండ్రులు ఖాజా రాహతుళ్ళ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థిని కరీనాకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆమె కష్టపడి చదివి ఉన్నత మార్కులు సాధించడం ఇతర విద్యార్థులకు ఆదర్శమని అధికారులు ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కరీనా పట్టుదల, కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరింత ముందుకు రావాలని కోరుతూ కార్యక్రమం ముగిసింది.



