Sunday, 26 July 2026
  • Home  
  • నీట్–సీబీఎస్‌ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – నీట్ తదితర పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కడప, జూలై 25 (పున్నమి ప్రతినిధి): దేశవ్యాప్తంగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు.
- E-పేపర్

నీట్–సీబీఎస్‌ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – నీట్ తదితర పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కడప, జూలై 25 (పున్నమి ప్రతినిధి): దేశవ్యాప్తంగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు.

నీట్–సీబీఎస్‌ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – నీట్ తదితర పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కడప, జూలై 25 (పున్నమి ప్రతినిధి): దేశవ్యాప్తంగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కడప వన్‌టౌన్ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన (క్యాండిల్ లైట్ మార్చ్) మరియు సత్యాగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్.డి. విజయ జ్యోతి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యా వ్యవస్థలో వరుసగా జరుగుతున్న వైఫల్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. నీట్, ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారమంతటిపై స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలోని ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎన్.డి. విజయ జ్యోతి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్, అసెంబ్లీ కోఆర్డినేటర్లు బండి జకరయ్య, ద్రుప్ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ బాషా, అశోక్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సత్తార్, రహమతుల్లా ఖాన్, రామకృష్ణ, కోటపాటి లక్ష్మయ్య, సిరాజుద్దీన్ హమీద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుభాన్ బీ, జహుర్, దాసరి శ్రీనివాసులు, షామీర్ హుస్సేన్, జాబీర్ అలీ, అబీద్ ఖాన్, మామిళ్ల బాబు, ఆసిఫ్ అలీ ఖాన్, రఫీఖ్ ఖాన్ (ఎన్‌ఆర్‌ఐ), రాజశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అబుతుల్లా, సుధాకర్ రెడ్డి, తిరుమలశెట్టి వేమయ్య, బద్రీనాథ్, షబానా, సంతోషమ్మ, శీలం గంగయ్య, పాలెం హరిప్రసాద్, అన్వర్ షేక్, అబ్బాస్, మహబూబ్ బాషా, షేక్ మౌలాలి, షేక్ కలందర్, షేక్ మొహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

నీట్–సీబీఎస్‌ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలి
– ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– నీట్ తదితర పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి

కడప, జూలై 25 (పున్నమి ప్రతినిధి):
దేశవ్యాప్తంగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు.

శనివారం సాయంత్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కడప వన్‌టౌన్ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన (క్యాండిల్ లైట్ మార్చ్) మరియు సత్యాగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎన్.డి. విజయ జ్యోతి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యా వ్యవస్థలో వరుసగా జరుగుతున్న వైఫల్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. నీట్, ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారమంతటిపై స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, ఈ ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

దేశంలోని ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎన్.డి. విజయ జ్యోతి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి అలీ ఖాన్, అసెంబ్లీ కోఆర్డినేటర్లు బండి జకరయ్య, ద్రుప్ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ బాషా, అశోక్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సత్తార్, రహమతుల్లా ఖాన్, రామకృష్ణ, కోటపాటి లక్ష్మయ్య, సిరాజుద్దీన్ హమీద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుభాన్ బీ, జహుర్, దాసరి శ్రీనివాసులు, షామీర్ హుస్సేన్, జాబీర్ అలీ, అబీద్ ఖాన్, మామిళ్ల బాబు, ఆసిఫ్ అలీ ఖాన్, రఫీఖ్ ఖాన్ (ఎన్‌ఆర్‌ఐ), రాజశేఖర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అబుతుల్లా, సుధాకర్ రెడ్డి, తిరుమలశెట్టి వేమయ్య, బద్రీనాథ్, షబానా, సంతోషమ్మ, శీలం గంగయ్య, పాలెం హరిప్రసాద్, అన్వర్ షేక్, అబ్బాస్, మహబూబ్ బాషా, షేక్ మౌలాలి, షేక్ కలందర్, షేక్ మొహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.