నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్, ‘యూట్యూబ్ 100’ ఛానెల్ నిర్వాహకులు నూర్ బాషాను గోళ్ళ సేవా సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక జర్నలిస్ట్‌ను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలపడం సంచలనంగా మారింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ సంస్థ తరఫున 52 వార్డుల్లోనూ అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు సంస్థ నిర్వాహకులు గోళ్ళ రాజేష్ ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు.రోజుకు 1,500 మందికి ఉచిత భోజన వసతి, పేద జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయంతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చిలకు కోటి రూపాయలకు పైగా విరాళాలు అందిస్తూ గోళ్ళ సేవా సంస్థ నంద్యాలలో విశేష సేవలందిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒక జర్నలిస్ట్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు విలేకరులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల మున్సిపల్ చైర్మన్ రేస్‌లో జర్నలిస్ట్ నూర్ బాషా