నంద్యాల: మస్జిద్-ఎ-రసూల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన 14వ నాతియా ముషాయిరా ఉర్దూ ప్రియులను విశేషంగా అలరించింది. రాష్ట్ర ఇత్తేహాదుల్ ఉలమా వల్ ఐయిమా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో, హాఫీజ్ ముహమ్మద్ సలీం పర్వేజ్ అధ్యక్షతన ఈ కవి సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమానికి ముంబై, హైదరాబాద్, యూపీ తదితర ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రముఖ జాతీయ స్థాయి ఉర్దూ కవులు ప్రవక్త ముహమ్మద్ (స) గుణగణాలు, జీవిత ఘట్టాలను తమ మధుర స్వరంతో గానం చేశారు. అనంతరం పాల్గొన్న కవులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఉర్దూ భాషా ప్రోత్సాహానికి ప్రతి ఏటా ఈ ముషాయిరా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నంద్యాల: మస్జిద్-ఎ-రసూల్‌లో అలరించిన 14వ ఉర్దూ సాహిత్య కవి సమ్మేళనం