దుప,దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఆర్సీ వర్తింపజేయాలని తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో శనివారం జరిగిన అర్చకుల అభినందన సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజల ప్రసాద్ శర్మ మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో నెల మొదటి తేదీన గౌరవ వేతనాలు అందడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్ డీవీఆర్ శర్మ తదితరులు హాజరై అర్చకులు ఐక్యంగా ఉండాలని సూచించారు. ధూప దీప నైవేద్య పథకంలో ‘పథకం’ పదాన్ని తొలగించి చట్ట సవరణ చేయాలని, గ్రామీణ అర్చకులకు పే స్కేల్ ఏర్పాటు చేయాలని కోరారు.



