పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 14): గోందీపల్లి గ్రామంలో “ఫ్రైడే – డ్రైడే” కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి మేడం, హెచ్ఎస్ లక్ష్మీదేవి, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త సుగుణమ్మ పాల్గొన్నారు.







