నంద్యాల, : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నంద్యాలలో ‘హర్ ఘర్ తిరంగా’ భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. టెక్కె మార్కెట్ యార్డులో మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరణ్ తదితరులు ‘నశా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేశారు.అనంతరం మువ్వన్నెల జెండాలతో గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. 2047 నాటికి దేశ, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



