దుత్తలూరు మండల కేంద్రంలోని మాదిగ భవన్ స్థలంలో బుధవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మండల సదస్సు నిర్వహించి నూతన మండల కమిటీలను నియమించారు. ఎంఎస్పీ మండల ఇన్చార్జి గొల్లపల్లి మోహన్రావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంద వెంకటేశ్వరరావు మాదిగ, జాతీయ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఇన్చార్జి పందిటి అంబేద్కర్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సెప్టెంబర్ 9న వరంగల్లో జరిగే జాతీయ సదస్సును విజయవంతం చేయాలని, ఎస్సీ వర్గీకరణ సాధన అనంతరం రాజ్యాధికార లక్ష్యంతో మాదిగలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



